'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

14, జులై 2009, మంగళవారం

ఓషో ఉత్తరాలు-12

నమస్తే,
నీ జాబు చేరింది. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. రాజనగర్ ప్రయాణం బాగా జరిగింది.

మతాన్ని
యోగం నుంచి విడదీస్తే అది ఉత్త నీతిపురాణం మాత్రం అవుతుంది. క్రమంలో దాని ఆత్మను కోల్పోతుంది. నీతి అనేది తిరస్కరనాత్మకము(negative). జీవితం తిరస్కరణ సిద్ధాంతం పైన ఆధారపడదు. తిరస్కరణ అనేది జీవితాన్ని బలోపేతం చెయ్యదు.

సాధనలో సిద్ధిని పొందటం ఎలా అన్నదే ప్రధానం కావాలి. సన్యాసం ప్రధానం కాదు. అజ్ఞానాన్ని త్యజించటం ముఖ్యం కాదు. జ్ఞానాన్ని పొందటమే ముఖ్యం. విషయం ముఖ్యం గా చెప్పబడాలి. సాధన అనేది పాజిటివ్ గా సాగాలి. సాధన యోగం ద్వారా వస్తుంది.

ఆచార్య తులసి, ముని నాథమల్ జీ మొదలైన వారితో నా చర్చలలో నేను ఇదే విషయాన్ని నొక్కి చెప్పాను. రాజ నగర్ నుంచి రాజ స్థాన్ నుంచి చాలా ఉత్తరాలు వచ్చాయి. నేను అక్కడకు వెళ్ళడం వల్ల కొంత ఉపయోగకరమైన పని జరిగినట్లు కనపడుతోంది.

ఒకటి మాత్రం స్పష్టం గా కనిపిస్తున్నది. ప్రజలు ఆధ్యాత్మిక జీవితం పట్ల తపనతో ఉన్నారు . కాని ప్రస్తుత మతాలు ఉన్న స్థితిలో వారికి శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. కాని మతాన్ని దాని అసలైన రూపంలో వారికి అర్థం అయ్యేటట్లు చెప్ప గలిగితే అది వారిలో గొప్ప మార్పును తేగలదు.

నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. భగవంతుడు నీకు శాంతిని ఇచ్చుగాక. అందరికీ నా ప్రేమాశీస్సులు.