“Most difficult thing in the world is to find people who are truly genuine"

28, మే 2009, గురువారం

ఓషో ఉత్తరాలు-9

ప్రేమాశీస్సులు.
నీ ఉత్తరాన్ని ప్రయాణంలో చదివాను.అది నా హృదయాన్ని తాకింది. జీవిత రహస్యాన్ని గ్రహించాలనే నీ కోరికబలీయమైతే, నేటి నీ తపనే ఒక నాటికి గమ్యాన్ని చేరుస్తుంది. జ్వలించే తపన ఒక్కటే సాధనలో కావలసింది. ఇంకేమీఅక్కరలేదు.

నదులు ఎలాగైతే సముద్రాన్ని చేరుతాయో, అలాగే మనిషి నిజంగా కోరుకుంటే సత్యాన్ని చేరగలడు. ఏ శిఖరమూ, ఏపర్వతమూ అతన్ని ఆపలేదు. ఇంకా చెప్పాలంటే ఆ అవరోధాలు అతనిలో సాహస అన్వేషణను ఇంకా గట్టి పరుస్తాయి. సత్యం ప్రతి ఒక్కరిలో ఉంది. నదులు సముద్రాన్ని కనుగొనాలి. కాని మన సముద్రం మనలోనే ఉంది. దాన్ని లోపలేఉంచుకుని ఎందఱో దాహం తో అలమటిస్తుంటారు. ఇదే విచిత్రం.

నిజానికి అంత వెతకవలసిన పని కూడా లేదు. క్రీస్తు ఒక మాట చెప్పాడు. అడుగు నీకు ఇవ్వబడుతుంది. కాని నీవుఅడుగకపోతే అది ఎవరి తప్పు? భగవంతుని పొందటం కంటే గొప్ప బేరం ఎక్కడా లేదు. ఎందుకంటే మనం ఊరకే అడిగితేచాలు. అంతకంటే చెయ్యవలసింది ఏమీ లేదు. ఈ అడగటం అనే తపన బలాన్ని పుంజుకునే కొద్దీ అడిగేవాడు కరిగిపోతూఉంటాడు. ఒక స్థాయికి చేరినపుడు, నీరు ఆవిరిగా మారే స్తాయిలాంటిది వస్తుంది. అక్కడ వెదికేవాడు పూర్తిగాఅంతర్ధానం అవుతాడు. ఉత్త అడగటం మాత్రమె ఉంటుంది. ఆ క్షణంలోనే సిద్ధి కలుగుతుంది.

నేను ఎక్కడ లేదో అక్కడ సత్యం ఉన్నది. ఈ అనుభవం ఒక్కటే దివ్యానుభవం. అహంకారం నశించటమే భగవంతుడుప్రత్యక్షం కావటం.

అందరికీ నా ఆశీస్సులు.