'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

15, మే 2009, శుక్రవారం

ఓషో ఉత్తరాలు-8

ప్రేమాశీస్సులు
మే నెల అంతా ప్రయాణాలలో గడపడంతో నా ఆరోగ్యం కొంత పాడైంది. అందుకే జూన్ నెలలో నా కార్యక్రమాలు-బాంబే, కలకత్తా, జైపూర్ అన్నీ ఆపివేశాను.

నీవు సమాధి యోగం తో ప్రయోగాలు చేస్తున్నానని వ్రాశావు. సంతోషం కలిగింది. ఫలితాలు ఆశించకు. సాధనకొనసాగించు. ఫలితం ఒక రోజు తప్పక వస్తుంది. క్రమేణా రాదు. ఉన్నట్లుండి ఒకరోజున హఠాత్తుగా అది కలుగుతుంది. నీకు తెలియకుండానే అది సంభవిస్తుంది. ఒకే ఒక్క క్షణంలో జీవితం అద్భుతంగా మారిపోతుంది.

నేను ప్రస్తుతం భగవాన్ మహావీరుని గురించి ఏమీ వ్రాయటం లేదు. ఏదైనా వ్రాయాలని నాలో ఇచ్చ కలగటం లేదు. కానినీవు వ్రాయమని బలవంత పెడితే అది వేరే సంగతి.

మిగిలిన అంతా బాగానే ఉంది.

ఉత్తరంలో ఓషో గారు కొన్ని ముఖ్య విషయాలు సూచిస్తారు. సాధనలో ఫలితాల మీద దృష్టి ఉండరాదు. ఇంతకుముందు ఉత్తరంలో కూడా ఆయన ఇదే సూచన చేశారు. కారణం ఏమిటంటే ఫలితం మీద దృష్టి ఉన్నపుడు సాధన మీదదృష్టి ఉండదు. సాధన సక్రమంగా జరుగదు. మనసులో ఒక భాగం ఫలితం మీద ఆశగా ఉంటే ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత లేనపుడు ధ్యాన నిష్ట చెడిపోతుంది. అపుడు మొదటికే మోసం వస్తుంది. కనుక సూచన.

సిద్ధి ఎలా కలుగుతుందో కూడా ఉత్తరంలో ఓషో గారు సూచించారు. అది మన సాధన వల్ల కలుగదు. సాధనాసమయంలో కూడా కలుగదు. ఏదో ఒక క్షణంలో మనం పూర్తిగా రిలాక్స్ అయి ఉన్న సమయంలో అది హఠాత్తుగాకలుగుతుంది. సైంటిస్టులకు చిక్కు ముడి వీడినట్లుగానే ఇది జరుగుతుంది. చాలా మంది సైంటిస్టులు తీవ్రంగాపరిశ్రమిస్తున్నపుడు వారికి పరిష్కారమూ దొరకలేదు. తరువాత ఎక్కడో రిలాక్స్ అవుతున్నపుడో, నిద్రలోనో, బయటవ్యాహ్యాళికి పోయినపుడో చటుక్కున వారికి పరిష్కారాలు స్ఫురించాయి. సాధనలో కూడా ఇలాగే జరుగుతుంది.

ఓషో గారికి 21 సంవత్సరాల వయసులో బుద్ధత్వం కలిగింది. జ్ఞాన సిద్ధి కలిగిన తరువాత జీవించవలసిన అవసరంలేదు. శరీరం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. పూర్వ కర్మానుసారం ఆయుస్సు ఉన్నంత కాలం శరీరం ఉంటుంది. తరువాతపోతుంది. కాని జ్ఞాని కి తన స్థితిలో ఎట్టి మార్పూ కలుగదు. జీవించి ఉన్నపుడు అతనికి ఎటువంటి ప్రత్యెక ఇచ్చ ఉండదు. కాని ఇతరులు కోరితే వారి మేలు కోసం పనులు చెయ్యగలడు.

ఇదే విషయం మహావీరుని గురించి వ్రాయమని ఆయన్ను ఎవరో అడిగితే సమాధానం చెప్పారు. ఓషో గారు జైన కుటుంబంలో పుట్టారు. కొంత కాలం జైన మతస్తులు ఆయననుగొప్ప సాధువు గా పూజించారు. కాని క్రమేణా ఒషోగారు భగవాన్ బుద్దుని వైపు మొగ్గు చూపారు. క్రమేణా జైనులకుదూరం అయ్యారు.