'చెత్త లోకం ! చెత్త మనుషులు ! '

24, మార్చి 2009, మంగళవారం

ఓషో ఉత్తరాలు - 5


ప్రేమాశీస్సులు. భగవంతుని దయ వల్లనే ఆంతరిక వెలుగు వైపు నీవు అడుగులు వేస్తున్నావు. వెలుగు ఖచ్చితంగా అక్కడ ఉన్నది. ఒక సారి అది కనిపిస్తే జీవితంలోని చీకటంతా మాయ మైతుంది. లోపలికి నీవు వేసే ప్రతి అడుగూ చీకటిని పొరలు పొరలుగా చేదిస్తుంది. వెలుగుతో నిండిన ఒక కొత్త లోకం నీ ముందు కనిపిస్తుంది.
అనుభవం అన్ని బంధాలనూ చేదిస్తుంది. చివరిగా, బంధం ఎప్పుడూ లేనే లేదన్న అనుభవం నీకు కలుగుతుంది. బంధం ఎప్పుడూ లేని దానికి మళ్ళీ మోక్షం కలుగుతుంది!!!
నీ పురోగతి నాకు సంతోషాన్ని ఇస్తున్నది. నీ ఉత్తరం చాలా కాలం క్రితం వచ్చింది. ఎప్పటిలాగే పనులతో, జవాబు ఇవ్వలేక పోయాను. కాని నీ జ్ఞాపకం ఎప్పుడూ ఉంది. వెలుగును వెతికేవారు ఎప్పుడూ నాకు గుర్తుంటారు. నా శుభాశీస్సులు వారివైపు ఎప్పుడూ ప్రవహిస్తాయి.
మనం ముందుకే నడవాలి. ఎన్నో సార్లు, దారిలో నిరాశ ఆవహిస్తుంది. కాని చివరకు, దప్పికతో ఉన్న బాటసారి నీటిని కనుగొంటాడు. నిజానికి దప్పిక కంటే ముందే నీరు అక్కడ ఉంది.
అందరికీ నా ఆశీస్సులు.