'చెత్త లోకం ! చెత్త మనుషులు ! '

21, మార్చి 2009, శనివారం

ఓషో ఉత్తరాలు -3

నమస్కారములు. నీ ఉత్తరం చూచి నాకు చాలా ఆనందం కలిగింది. ఇంతవరకు నేను నా విధానం గూర్చి ఏమీ వ్రాయలేదు. ఇక్కడ ఒక ధ్యాన కేంద్రం మొదలైంది. కొందరు స్నేహితులు కలిసి ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఏవైనా ఖచ్చితమైన ఫలితాలు వచ్చినపుడు నా విధానం గురించి ఏదైనా వ్రాస్తాను.
నా మీద నా ప్రయోగాల గురించి నాకు ఖచ్చితమైన ఫలితాలున్నాయి. కాని అవి ఇతరుల మీద కూడా పని చేస్తాయో లేదో చూడాలి. నేను తత్వ శాస్త్ర గ్రంథాల లాగా వ్రాయను. నా విధానం పూర్తిగా శాస్త్రీయం. కొన్ని మానసిక, అతి మానసిక ప్రయోగాల ఆధారాలతో నేను యోగం మీద లోకానికి కొంత చెప్పాలనుకుంటున్నాను. లోకం లో దీనిపై చాలా అపోహలున్నాయి. వాటిని పోగొట్టాలి. కనుక నేనిక్కడ కూడా ప్రయోగాలు చేస్తున్నాను.
ఒక్క విషయం స్పష్టం. నేను చేసే పని గుంపునో, సంస్థనో తయారు చేయడానికి కాదు. నువ్విక్కడికి ఒస్తే మనం విషయాలపై ఇంకా మాట్లాడు కోవచ్చు.