“జ్ఞానాన్ని పొందటం కాదు. తానే అదిగా అయిపోతాడు"- రమణ మహర్షి

19, మార్చి 2009, గురువారం

ఓషో ఉత్తరాలు

ఓషో ఉత్తరాలు-తరువాయి భాగం

కర్మలో అకర్మ
చలనంలో నిశ్చలత్వం
మార్పులో శాశ్వతత్వం
ఏదైతే ఉందొ అదే సత్యం, అదే నిత్యం
నిత్యత్వంలోనే నిజమైన జీవితం ఉంది
తక్కినవన్నీ కలలు
నిజానికి ప్రపంచం ఒక స్వప్నం
కలలను త్యజించాలా వద్దా అనేది కాదు అసలు ప్రశ్న
వాటిని గమనించు అంతే.

ఎరుకతో అంతా మారిపోతుంది
ఇరుసు మారుతుంది
శరీరం నుంచి ఆత్మకు నీ ఎరుక మారుతుంది
స్థితిలో ఏముంది?
అది చెప్పలేము
ఎవరూ చెప్పలేదు
ఎవరూ చెప్పలేరు కూడా
తనకు తాను దాన్ని తెలుసుకోటం తప్ప మార్గం లేదు
మరణించడం ద్వారానే మరణం తెలుస్తూంది
సత్యం నీలో నువ్వు లోతుగా మునిగితేనే తెలుస్తూంది
భగవంతుడు నిన్ను సత్యంలో ముంచుగాక.