'చెత్త లోకం ! చెత్త మనుషులు ! '

18, మార్చి 2009, బుధవారం

ఓషో ఉత్తరాలు - 1


( 1962 లో వ్రాసినవి)
-----------------
ప్రేమాశీస్సులు. నీ జాబు అందింది. ఏదైనా జాబు వ్రాయమని నీవెంత ప్రేమతో అడిగావో? మరి నేనిక్కడ అగాధ మౌనంలోమునిగి ఉన్నాను. నేను మాట్లాడుతున్నాను. పని చేస్తున్నాను. కాని అంతరికంగా శూన్యంలో కూరుకుపోయి ఉన్నాను. అక్కడ చలనమే లేదు. రెండు జీవితాలు ఒకే సారి జీవిస్తున్నట్లు నాకు తోస్తున్నది. ఏమి నాటకం!! జీవితమే ఒక నాటకంలాఉంది. ఈ స్పృహతో ఉంటే విచిత్ర మైన స్వాతంత్రానికి వాకిలి తెరుచుకుంటున్నది.

ఓషో గారు తన జీవితంలో ఆశువుగా చెప్పిన ఉపన్యాసాలు ప్రింటు చేస్తే 300 పైన పుస్తకాలయ్యాయి. ఆయన స్పృశించనివిషయమే భూమ్మీద లేదు. ఏ ఆధ్యాత్మిక గురువూ తాకని మాట్లాడని విషయాలు కూడా ఆయన తేట తెల్లంగాచర్చించాడు. 


తాత్విక చింతన, అనుభవ జ్ఞానం, అనర్గళమైన భాష, వాక్పటిమ, నిగూఢ విషయాలను అతి తేలికగా వివరించటం, ఏసిద్ధాంతానికీ కట్టు బడక పోవటం, అతి నవీన భావాలు, ప్రాచ్య పశ్చిమ తత్వ శాస్త్రాలలో లోతైన పాండిత్యం, అన్నింటినీమించి 21 ఏళ్లకే బుద్ధత్వాన్ని పొందటం ఇన్ని కోణాలు ఒక్క మహానీయునిలో ఇంతవరకు కనిపించలేదు.

కాని మన దౌర్భాగ్యం!! ప్రపంచం ఆయన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ఆ మాటకొస్తే ఏ ప్రవక్తా తన జీవిత కాలంలో సరిగాఅర్థం చేసుకో బడడు. అలా జరిగితే అతడు ప్రవక్తే కాదు. ఈ విషయం కూడా ఆయనే చెప్పాడు. తను చెప్పింది సరిగాఅందరూ అర్థం చేసుకోవాలంటే ఇంకా రెండు మూడు వందల ఏళ్ళు పడుతుందని ఆయనే అన్నాడు.

1960 ల లో ఆయన తన స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలు వరుసగా చూద్దాం. ఇవి చదివితే ఓషో అంటే ఏమిటో మనకుతెలుస్తుంది.

అంతరికంగా శూన్యం. బాహ్యం గా కర్మ. ఇది జీవన్ముక్తుని స్థితి. భగవత్ గీత రెండవ అధ్యాయంలో ఇదే స్థితి చెప్పబడింది. ఓషో 1962 లో ఇట్టి స్థితిలో ఉన్నట్లు మనకు ఈ ఉత్తరం ద్వారా అర్థమైతుంది.