'చెత్త లోకం ! చెత్త మనుషులు ! '

3, మార్చి 2009, మంగళవారం

జెన్ కథలు- ప్రపంచంలో విలువైన వస్తువు

-----
సోజాన్ అనే చైనా జెన్ మాస్టర్ ను ఒక శిష్యుడు అడిగాడు.
ప్రపంచంలోకెల్లా విలువైన వస్తువు ఏది?
చచ్చిన పిల్లి తల. చెప్పాడు సోజాన్
చచ్చిన పిల్లి తల ఎందుకు అంత విలువైనది? అడిగాడు శిష్యుడు

సోజాన్ చెప్పాడు. ఎందుకంటే ఎవరూ దాని విలువ కట్టలేరు కనుక.
-----
జెన్ మాస్టర్ల సంభాషణలు వింతగా ఉంటాయి. అర్థం లేని మాటలవలే ఉంటాయి. కాని నిగూఢమైన అర్థమును కలిగి ఉంటాయి. జెన్ శైలి అటువంటిది.

కథ అర్థం కావాలీ అంటే మూడు విషయాలు అర్థం చేసుకోవాలి.

1.దేని విలువ నైతే ఎవరూ చెప్పలేరో అది అత్యంత విలువైనది. వెల అమూల్యము అని కొన్ని పుస్తకాల మీద చూడ
వచ్చు. అటువంటిది అన్నమాట. చచ్చిన పిల్లి తల కూడా విలువ లేనిదే. కనుక అత్యంత విలువైనది. లోకంలో దేనినైతే పనికి రానిదిగా చూస్తుంటామో నిజానికి అదే అత్యంత విలువైనది. చూచే కోణాన్ని బట్టి అంతా ఉంటుంది. ఒకప్పుడు ఎందుకూ పనికి రాని అరేబియా ఎడారులు ఇప్పుడు ప్రపంచానికి ఆయిల్ గనులు. పనికి రాని ప్రకాశం జిల్లా భూములు ఇప్పుడు గ్రానైటు గనులు.

2. పిల్లి చాలా తెలివైనది. ఎప్పుడూ ఏమరుపాటు చెందదు. ఈజిప్షియన్ నాగరికతలో పిల్లిని దేవతగా కొలుస్తారు. చీమ చిటుక్కు మన్నా పిల్లి పసిగడు తుంది. పిల్లి తెలివికి చిహ్నము. మనిషి కూడా పిల్లి వలెనె అతి తెలివి కలిగినవాడు. దీనినే లౌక్యం అంటున్నాము.

ఎంత లౌ
క్యం ఉంటే అంత తెలివైన వాడని భావన. కాని లౌక్యం అనేది ఆంతరిక జీవనంలో పెద్ద ఆటంకము. లౌక్యం ఉన్న వానికి ఆంతరిక జీవిత వాకిళ్ళు తెరుచుకోవు. సరళమైన మనస్సు, అమాయకమైన మనస్సు కలవారికే ఆంతరిక ద్వారాలు స్వాగతం పలుకుతాయి.

ప్రాణి కైనా మెదడు తలలోనే ఉంటుంది. తెలివికి చిహ్నం మెదడు మరియు తల. చనిపోయిన పిల్లి మెదడు ఆలోచించలేదు. దాని తెలివి అంతా సమాప్తం అవుతుంది. కనుక లౌక్యం లేని మనసే ప్రపంచంలోకి అత్యంత విలువైన వస్తువు.

3. ఆశలు
, కోరికలు మన తలలో ఉండి జీవితాంతం బాధలు పెడతాయి. జీవితం ఎటు వైపు సాగుతున్నదో తెలియని వేగంతో ప్రయాణించి చివరకు అర్థాంతరంగా ముగుస్తుంది. ఎవరి జీవితమైనా ఇంతే. కోరికలు తీరని స్థితిలోనే చావు వరిస్తుంది.

కాని ఎవడైతే జీవించి ఉన్నప్పుడే మృతుడౌతాడో, అనగా ఎవని ఆశలు, కోరికలు పరిసమాప్తి అవుతాయో అతడు ముక్తుడు. జీవన మృతుడే జీవన ముక్తుడు. చావు కంటే ముందే చావ గలిగినవాడే గమ్యం చేరగలడు. చావుతో చచ్చేవాడు చావడు. మళ్ళీ పుడతాడు.

కనుక తెలివి, బుద్ధి, ఆశలు అన్నీ సమాప్తమై చచ్చిన పిల్లి తో సమానంగా మారినపుడు అతడు బుద్దుడౌతాడు.

బుద్ధత్వము ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది. ఎవరూ దీనికి విలువ కట్టలేరు. ఎందుకంటే బుద్ధుని మరొక బుద్ధుడే అర్థము చేసుకొన గలడు. శూన్య స్థితి పొందిన వాడే మరొక శూన్యమును గ్రహించగలడు.సామాన్యులు అతని విలువ గ్రహించలేరు. మనము ఉన్న స్థితినే మనము ప్రపంచములో చూడగలము గ్రహించగలము. జ్ఞానిని పిచ్చివాడు అనుకోవడానికి కారణమిదే. మనకు పిచ్చి తె
లుసు. కాని జ్ఞాని స్థితి తెలియదు. కనుక తెలిసిన స్థితితో పోల్చి చూచి జ్ఞాని కూడా పిచ్చివాడే అని తేలుస్తాము.

ప్రాపంచిక తె
లివి అంతమైన నిశ్చల స్థితి ప్రపంచంలో అన్నింటికన్నా విలువైనది.

సోజాన్ తన క్లుప్తమైన సమాధానంలో ఇంతటి గూడార్దమును నిక్షిప్తం చేసాడు.

(అంతుబట్టని జెన్ కథలను అతి సులభంగా వివరించిన సద్గురువు ఓషో రజనీష్ ను స్మరిస్తూ)